“అరిచి అరగదీయమ్మ”తో పూనకం తెప్పిస్తున్న భజ్జీ..!

Published on Jul 4, 2021 12:59 am IST

టీమిండియా క్రికెట్ మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. గుర్తున్నాడా.. సినీ రంగానికి ఈ పేరుకు పెద్దగా సంబంధం లేదు అని ఆలోచిస్తున్నారు కదా.! అయితే వినండి తన స్పిన్ మాయాజాలంతో ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను సైతం బురిడీ కొట్టించిన ఈ పంజాబ్ సింగ్ సినిమాల్లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. హీరోగా భజ్జీ తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఫ్రెండ్‌షిప్‌’. సింగ్‌ అండ్‌ కింగ్‌ అనేది దీనికి ఉప శీర్షిక. ఈ సినిమాలో సీనియర్ హీరో అర్జున్ కూడా నటిస్తున్నాడు.

రూ.25 కోట్ల వ్యయంతో స్నేహం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి జాన్‌పాల్‌ రాజ్-శ్యామ్‌ సూర్య సంయుక్తంగా దర్శకత్వం వహిస్తుండగా, ఏ.ఎన్‌.బాలాజీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే నేడు భజ్జీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన “అరిచి అరగదీయమ్మ” అనే లిరికల్ వీడియో సాంగ్ తెగ ఆకట్టుకుంటుంది. ఫుల్ మాస్ లిరిక్స్‌తో ఉన్న ఈ సాంగ్ వింటుంటే పూనకాన్ని తెప్పించేలా ఉంది. ఈ పాటను షేన్‌భాగరాజ్, నిన్సీ విన్సెంట్ ఆలపించగా, ఎస్.పి. అభిషేక్ లిరిక్స్, డి.ఎం.ఉదయ్‌కుమార్‌ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :