ఆక్సిజన్ మాస్క్ తో వెంటిలేటర్ పై అరియానా..!

Published on Jul 23, 2021 1:24 am IST

బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ, బిగ్‌బాస్ ఫేం అరియానా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల వివాదస్పద దర్శకుడు ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా వార్తల్లో నిలిచింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరించే అరియానా తాజాగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా హాస్పిటల్ బెడ్ పై కనిపించి షాక్ ఇచ్చింది. ఇన్‌స్టా స్టోరీలో వెంటిలేటర్ పెట్టుకున్న వీడియోను ఆమె షేర్ చేసింది.

అయితే ఇది చూసి తొలుత షాక్ అయిన అబిమానులు ఆ తర్వాత ఇది ఓ సినిమా షూటింగ్‌లో భాగమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో అరియానా ఓ పాత్ర చేస్తుంది. ఈ సినిమాలో భాగంగానే అరియానా వెంటిలేటర్ ధరించినట్టు తెలుస్తుంది. ఇదీ పక్కన పెడితే యంగ్ హీరో రాజ్ తరుణ్ సినిమాలో కూడా అరియానా ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :