అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మరో పది రోజుల్లో .. !

Published on May 7, 2019 3:55 pm IST

బ్లాక్ బ్లాస్టర్ మూవీ అర్జున్ రెడ్డి కి రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిత్య వర్మ’. చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో భణిత సంధు హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం ఫారెన్ లో లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్ డెహ్రాడూన్ లో జరుగనుంది. పది రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

అర్జున్ రెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ4 ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రధాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిసెకండ్ హాఫ్ లో ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More