‘తలైవి’ కోసం అరవిందస్వామి మేకోవర్ సూపర్ !

Published on Nov 15, 2019 12:30 am IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా మొదలైంది. ఈ చిత్రంలో జయలలిత జీవితంలో ప్రధాన వ్యక్తి ఎంజీఆర్ పాత్ర కూడా ఉంది. ఈ పాత్రలో ప్రముఖ నటుడు అరవిందస్వామి నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చేసుకున్న మేకోవర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం అప్పట్లో ఎంజీఆర్ ఎలాగైతే క్లీన్ షేవ్ చేసుకుని ఉండేవారో అలాగే ఉన్నారు అరవిందస్వామి.

తాజాగా బయటికొచ్చిన ఆయన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రానికి నిరవ్ షా సినిమాటోగ్రఫీ చేయనుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నాడు. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘తలైవి’గా వస్తున్న ఈ చిత్రం హిందీలో ‘జయ’ పేరుతో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :