విజయ్ సేతుపతి పాత్రలో ఆర్య ఫిక్స్ ?

విజయ్ సేతుపతి పాత్రలో ఆర్య ఫిక్స్ ?

Published on Jan 3, 2021 11:30 PM IST

Arya

‘పుష్ప’ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. కానీ, కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అవ్వడం, డేట్స్ అన్ని క్రాస్ అవ్వడం.. చివరకు విజయ్ సేతుపతి సినిమా నుండి తప్పుకోవడం జరిగిపోయాయి. అయితే విజయ్ సేతుపతి పాత్రలో ఎవర్ని తీసుకోబోతున్నారు అనే విషయంలో ఇప్పటికే అనేక రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ సేతుపతి లాంటి ఆర్టిస్ట్ కావాలి అంటే.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉండాలి అంటే.. మరో హీరోనే తీసుకోవాలి.

అందుకే ఆ పాత్రలో తమిళ హీరో ఆర్యను తీసుకోబోతున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. మరి బన్నీ పుష్ప కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు