ప్రస్తుతానికి “భీమ్లా నాయక్” తగ్గేలా లేడు.!

Published on Oct 6, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకొని ఉన్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. అయితే ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ నిన్న ఈ సినిమా సెకండ్ సింగిల్ పై కూడా అప్డేట్ ఇచ్చారు. ఈసారి మంచి రొమాంటిక్ నెంబర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇందులో భీమ్లా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.

మొదటి నుంచి చెప్తున్నట్టుగా జనవరి 12నే భీమ్లా రిపోర్టింగ్ ఉంటుందని డేట్ మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. అయితే ఊహించని పోటీ నడుమ సినిమా తేదీ మారుతుంది అని సినీ వర్గాల్లో టాక్ ఉంది కానీ చివరి నిమిషం వరకు ఏదీ చెప్పలేం.. ప్రస్తుతానికి మాత్రం భీమ్లా వెనకడుగు వేసేలా మాత్రం లేడని అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :