మహేష్ మేనల్లుడు మాస్ హీరోగానే…?

Published on Nov 10, 2019 9:02 pm IST

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీస్ లో ఘట్టమనేని కుటుంబం ఒకటి. అలాంటి కుటుంబం నుండి నేడు ఓ నూతన నటుడు లాంచ్ అవుతున్నాడు. మహేష్ మేనల్లుడు మరియు టీడీపీ రిచ్చెస్ట్ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడైన గల్లా అశోక్ హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం నేడు రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభమైంది. రామ్ చరణ్ అతిధిగా పాల్గొన్న ఈకార్యక్రమంలో కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు,రాజకీయ మరియు టాలీవుడ్ ప్రముఖులు అలాగే రానా దగ్గుబాటి హాజరయ్యారు.

కాగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీలో అశోక్ పాత్రను పూర్తి స్థాయి మాస్ హీరో రేంజ్ లో చూపించనున్నాడట. భారీ డైలాగ్స్ మరియు హై వోల్టేజ్ ఫైట్స్ తో పాటు నిధి అగర్వాల్ తో ఓ రొమాంటిక్ లవ్ ఎపిసోడ్స్ తో స్క్రిప్ట్ సిద్ధం చేశాడని సమాచారం. భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. కుమారుడు అశోక్ గల్లా హీరోగా ఎంపీ జయ్ దేవ్ గల్లా స్వయంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహేష్ ఈ లాంచింగ్ కార్యక్రమానికి రాలేకపోయినా, సోషల్ మీడియా వేదికగా విశెష్ చెప్పారు.

సంబంధిత సమాచారం :

More