ఫిబ్రవరి 2 న “అశోకవనంలో అర్జున కళ్యాణం” టీజర్

Published on Jan 31, 2022 2:00 pm IST

విశ్వక్ సేన్ హీరో గా, రుక్సర్ దిల్లాన్ హీరోయిన్ గా విద్యా సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రం ను SVCC డిజిటల్ పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను ప్రకటించిన సందర్భం నుండి సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి.

తాజాగా ఈ చిత్రం నుండి టీజర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ఫిబ్రవరి 2 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. జయ్ క్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో విశ్వక్ సేన్ సరికొత్తగా కనిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం :