ఇంటర్వ్యూ : నితిన్ జి – ‘అశ్వమేథం’ ఎంటర్టైనర్ గా సాగే స్పై థ్రిల్లర్ !

ఇంటర్వ్యూ : నితిన్ జి – ‘అశ్వమేథం’ ఎంటర్టైనర్ గా సాగే స్పై థ్రిల్లర్ !

Published on Jul 31, 2019 4:11 PM IST

ధృవ్ కరుణాకర్, శివంగి హీరో హీరోయిన్స్ గా నితిన్ జి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘అశ్వమేథం’. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా… ఆరోస్ అవతార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఐశ్వర్య యాదవ్ నిర్మించారు. కాగా ఈ చిత్ర దర్శకుడు నితిన్ జి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి నితిన్ జి వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం…

 

మీ గురించి చెప్పండి ?

 

నా పేరు నితిన్ జి. ‘అశ్వమేథం’ సినిమాకి దర్శకత్వం వహించాను. తెలుగులో నాకు ఇదే ఫస్ట్ ఫిల్మ్. అంతకు ముందు మరాఠీలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాను.

 

మరి మరాఠీ సినిమాల నుండి.. తెలుగు సినిమా వైపు ఎలా వచ్చారు ?

 

నిజానికి నాకు తెలుగు మాట్లాడటం కూడా రాదు. మా నిర్మాత ప్రోత్సాహంతోనే తెలుగులో ఈ సినిమాకి డైరెక్షన్ చేశాను.

 

తెలుగు మాట్లాడటం రాకుండానే.. తెలుగులో సినిమా చేశారు. భాష పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?

 

జాగ్రత్తలు అంటే.. ఏది డైరెక్ట్ చేయబోతున్నాం, సీన్ లో ఎమోషన్ ఏంటి, అసలు సీన్ ఏంటి అనే అంశాలను క్లారిటీగా అర్ధం చేసుకుంటే చాలు. భాష వచ్చినా చేసే పని అదే కదా. నాకు భాష రాకపోయినా.. నేను ఆ పని చేస్తాను. పైగా ప్రీ ప్రొడక్షన్ లో స్క్రిప్ట్ మీదే వర్క్ చేస్తున్నప్పుడే తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అని చర్చించి స్క్రిప్ట్ చేసుకున్నాం.

 

‘అశ్వమేథం’ డైరెక్ట్ తెలుగు సినిమానా.. లేక..?

 

డైరెక్ట్ తెలుగు సినిమానే. ఎలాంటి రీమేక్ కాదు. ఈ సినిమా స్క్రిప్ట్ ను కూడా తెలుగులోనే రాశాము. రచయిత జగదీష్ మెట్ల ఈ స్క్రిప్ట్ ను రాశారు.

 

మీ సినీ నేపథ్యం మరాఠీలోనే ఎక్కువుగా సాగింది. తెలుగు సినిమాలు చూస్తారా ?

 

ఖచ్చితంగా. తెలుగు సినిమాలను నేను రెగ్యులర్ గా చూస్తాను. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలు నార్త్ లో కూడా బాగా చూస్తారు. అలాగే రవితేజ కూడా అక్కడి ప్రేక్షకులకు బాగా తెలుసు. బాహుబలి తరువాత తెలుగు సినిమా గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు.

 

ఈ సినిమా హీరో హీరోయిన్ల గురించి ?

 

ఈ సినిమాలో ధృవ్ కరుణాకర్ హీరోగా, శివంగి హీరోయిన్ గా నటించింది. ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ధృవ్ కరుణాకర్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతాడు. అతను మంచి టాలెంటెడ్ పర్సన్.

 

మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ వర్క్ ఎలా అనిపించింది ?

 

ఈ సినిమాకి చరణ్ అర్జున్ మ్యూజిక్ హైలెట్ కానుంది. తను చేసిన పాటలన్ని చాల బాగా వచ్చాయి. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా మేకింగ్ పరంగా ఏమి కావాలన్నా అద్భుతంగా సపోర్ట్ చేశారు.

 

చివరిగా, ఈ సినిమా గురించి చెప్పండి ?

 

స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని సపోర్ట్ చేస్తోనందుకు అందరికి చాలా థాంక్స్.. స్పై థ్రిల్లర్ గా సాగే ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తప్పక హిట్ అవుతుందనే నమ్మకం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు