ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో, సినిమా సినిమాకి సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ, ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ యువ హీరో నటించిన మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అసుర’. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నాటి నుంచే ఈ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇటీవలే ఈ చిత్ర టీం అసురని మే 29న గ్రాండ్ గా రిలేజ్ చెయ్యడానికి ప్లాన్ చేసారు. తాజా సమాచారం ప్రకారం మరో రెండు రోజుల్లో ఈ సినిమా ఫస్ట్ కాపీ సిద్దం కానుంది. దాంతో మే 25న ఈ చిత్ర టీం అసుర ని సెన్సార్ కార్యక్రమాల కోసం పంపడానికి నిర్ణయించుకున్నారు.
ఇటీవలే పలువురు రాజకీయ ప్రముఖులు సమక్షంలో ఆడియో మరియు ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరూ సింప్లీ సూపర్బ్ అంటున్నారు. నారా రోహిత్ ని డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన విధానం, అతని మానరిజమ్స్, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మన పురాణాల్లో రాక్షసుడు అంటే వాడొక క్రూరుడు, దయ జాలి లేని వాడు. అలాంటి రాక్షసుడి స్వభావంని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో హీరో పాత్రని డిజైన్ చెయ్యడం అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.


