సింప్లీ సూపర్బ్ : నారా రోహిత్ ‘అసుర’ ట్రైలర్

సింప్లీ సూపర్బ్ : నారా రోహిత్ ‘అసుర’ ట్రైలర్

Published on May 15, 2015 5:35 PM IST

asura
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో.. మరియు సినిమా సినిమాకి సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూనే, ఎబ్టర్ టైన్ కూడా చేస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. ఈ యువ హీరో నటించిన సినిమా ‘అసుర’. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన నాటి నుంచే ఈ సినిమా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకి పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకలో ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ని చూసిన ప్రతి ఒక్కరూ సింప్లీ సూపర్బ్ అంటున్నారు.

నారా రోహిత్ ని డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించిన విధానం, అతని మానరిజమ్స్, డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘నోటితో చెప్పే మాటకంటే చేత్తో చెప్పే మాటే ఎక్కువ గుర్తుంటుంది’ అని చెప్పిన డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మన పురాణాల్లో రాక్షసుడు అంటే వాడొక క్రూరుడు, దయ జాలి లేని వాడు. అలాంటి రాక్షసుడి స్వభావంని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాలో హీరో పాత్రని డిజైన్ చెయ్యడం అందరినీ ఆకట్టుకుంటోంది. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాని నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

తాజా వార్తలు