సాలిడ్ లుక్ తో “హిడింబ” గా వచ్చిన అశ్విన్.!

Published on Aug 1, 2021 3:48 pm IST


“రాజు గారి గది” సిరీస్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ వాటితో పాటు మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాడు. మరి అలా తన లైనప్ లో ఓ ఆసక్తికర సినిమా నుంచి టైటిల్ అండ్ లుక్ పోస్టర్ ఇప్పుడు బయటకి వచ్చింది.

దర్శకుడు అనీల్ కృష్ణ కన్నెగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి “హిడింబ” అనే టైటిల్ ని సెట్ చెయ్యడమే కాకుండా సాలిడ్ పర్సనాలిటీ లో ఉన్న అశ్విన్ లుక్ ని కూడా మేకర్స్ రివీల్ చేశారు. మాస్ షేడ్ లో బాగా కనిపిస్తున్న అశ్విన్ ఈ సినిమా కోసం కొత్త మేకోవర్ ని కూడా సిద్ధం చేస్తున్నాడట.

ఇక అలాగే 50 శాతం మేర షూట్ కంప్లీట్ అయ్యిన ఈ చిత్రంలో నందిత శ్వేత హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతం అందిస్తుండగా ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణం జరుగుతుంది.

సంబంధిత సమాచారం :