టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి అభిమానుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలను చూసేందుకు అభిమానులు థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఇక ఓవర్సీస్‌లోనూ మహేష్ క్రేజ్ మామూలుగా లేదు. దీనికి ఉదాహరణ తాజాగా రీ-రిలీజ్ అయిన ‘అతడు’ సినిమా నిలిచింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అతడు’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అక్కడ ఈ సినిమా ఏకంగా 100K డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇలా ఓవర్సీస్ మార్కెట్‌లో ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాలతో 100K డాలర్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక హీరోగా మహేష్ బాబు నిలిచాడు.
దీంతో ఈ ఫీట్ సాధించిన హీరోగా మహేష్ రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 చిత్రంలో నటిస్తున్నాడు.


