తెలుగు స్టార్ హీరోతో అట్లీ సినిమా !

తమిళ యువ దర్శకుల్లో అట్లీ కుమార్ కూడ ఒకరు. ఆయన చేసిన మొదటి మూడు సినిమాలు ‘రాజా రాణి, తేరి, మెర్సల్ ‘ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ మూడు సినిమాల్లో రెండు స్టార్ హీరో విజయ్ తో చేయడం విశేషం. ‘మెర్సల్’ ఘనవిజయం అందుకోవడంతో ఆయన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తారో చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది.

ఈ నైపథ్యంలో ఆయన తన తర్వాతి సినిమా తమిళంలో కాకుండా తెలుగులో ఉండబోతోందని, అది కూడ ఒక పెద్ద స్టార్ హీరోతో అని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు. మరి అట్లీ డైరెక్ట్ చేయబోయే ఆ స్టార్ హీరో ఎవరో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.