గెట్ రెడీ..మహేష్ స్వాగ్ తో గిఫ్ట్ దద్దరిల్లుతుందట.!

Published on Aug 3, 2021 10:51 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల కాంబోలో “సర్కారు వారి పాట” అనే అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది.

అయితే అదే రోజున ఈ చిత్రం రిలీజ్ డేట్ సహా మహేష్ బర్త్ డేట్ ఆగష్టు 9 కి అసలైన ట్రీట్ బ్లాస్ట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ ట్రీట్ అనంతరం సూపర్ స్టార్ నుంచి మరోసారి అసలైన మాసివ్ స్వాగ్ ను విట్నెస్ చెయ్యడానికి సిద్ధంగా ఉండమని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

అలాగే ఈసారి కూడా మొత్తకి బొమ్మ దద్దరిల్లుతుంది అని మరింత హైప్ తీసుకొస్తున్నారు. మరి ఆగష్టు 9న ఇచ్చే ఆ మాస్ ట్రీట్ ఏంటో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :