మహేష్ -బన్నీ ప్రేక్షకులను కన్యూజ్ చేస్తున్నారే..!

Published on Jan 17, 2020 3:08 pm IST

సంక్రాంతి హీరోలు మహేష్ బన్నీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. విడుదలకు ముందు థియేటర్స్, డేట్స్ విషయంలో మొదలైన విభేదాలు విడుదల తరువాత కూడా కొనసాగుతున్నాయి. మేము గొప్పంటే మేమంటూ…గొడవపడుతున్నారు. నిజానికి మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, బన్నీ నటించిన అల వైకుంఠపురంలో చిత్రాలు రెండింటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే పండుగ సీజన్ కావడంతో రెండు సినిమాలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. కానీ రికార్డులు, మరియు కలెక్షన్స్ విషయంలో ఒకరికి మించి ఒకరు పోస్టర్స్ వదులుతున్నారు.

ముఖ్యంగా నాన్ భాహుబలి రికార్డ్స్ మావంటే..మావంటూ ఇద్దరు పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. దీనితో అసలు నాన్ బాహుబలి రికార్డ్స్ ఎవరివి అనేవి ప్రేక్షకులకు అంతు చిక్కడం లేదు. రెండు చిత్రాలు ప్రేక్షకులకు నచ్చాయి అన్నది నిజం. ఈ నేపథ్యంలో ఈ కలెక్షన్స్ వార్ వలన ఆడియన్స్ కి సినిమాల పట్ల గౌరవం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ హీరోలు ఇద్దరూ నాన్ బాహుబలి వార్ వదిలేస్తే మంచిది.

సంబంధిత సమాచారం :

X
More