టాక్..అవైటెడ్ “ఆచార్య” రిలీజ్ మోస్ట్లీ అప్పుడే..!

Published on Aug 18, 2021 3:42 pm IST


ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన హై బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం “ఆచార్య” కూడా ఒకటి. మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తుది మెరుగులు దిద్దుకుంటుంది.

అయితే ఈ చిత్రం విడుదల ఎప్పుడు అనేది మెగా ఫాన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీ వర్గాల్లో మోస్ట్ అవైటెడ్ గా మారింది. మరి దీనికి ఇంకొన్ని రోజుల్లోనే సమాధానం దొరికేలా ఉండగా లేటెస్ట్ టాక్ ఒకటి ఇప్పుడు వినిపిస్తుంది. దాదాపు ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాదికే ఫిక్స్ చేశారట. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే ఆచార్య నిలవనున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో స్ట్రాంగ్ బజ్.

మరి దీనిపైనే అధికారిక ప్రకటన రానున్న కొన్ని రోజుల్లో రాబోవడం కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :