“అఖండ” నుంచి అవైటెడ్ అప్డేట్ రానుందా.?

Published on Jul 23, 2021 12:50 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉండగా బాలయ్య మరియు ప్రగ్యా ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ సినిమాపై ఎప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ రానుండొచ్చేమో అని టాక్ వినిపిస్తుంది. అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కోసం.. థమన్ ఈ చిత్రానికి అదిరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్టుగా అర్ధం అయ్యింది. దీనితో ఈ సినిమా ఆల్బమ్ పై ఏర్పడ్డాయి. ఆ మధ్య ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై బజ్ వినిపించింది కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు దీనిపై త్వరలోనే అప్డేట్ రానున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :