
చందమామ కధలు సినిమాతో జాతీయ అవార్డు గ్రహిత ప్రవీణ్ సత్తారు సరికొత్త కధా కధనాలతో చిత్రాన్ని తెరకెక్కించి అందరి ప్రశంసలను అందుకున్నాడు.
ఈ చిత్ర విజయంతో దర్శకుడికి తనపై తనకి నమ్మకం పెరిగింది. ప్రస్తుతం గుంటూరు బస్తీలో వుండే వాసుల నేపధ్యంలో ఒక కామెడీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. హిందూపూర్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ చిత్రానికి ‘గుంటూరు టాకీస్’ అనే పేరుని పరిశీలిస్తున్నారు.
చందమామ కధలు సినిమాలో ముఖ్య భూమికను పోషించిన నటుడు నరేష్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రద్ధా దాస్, మహేష్ మంజ్రేకర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు.
ఆర్.కె స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

