ఓవర్సీస్లో దూసుకుపోతున్న ‘అ !’ !
Published on Feb 19, 2018 12:09 pm IST

హీరో నాని సమర్పణలో రూపొందిన ‘అ !’ చిత్రం గత శుక్రవారం విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్నా ఓవర్సీస్లో మాత్రం మంచి టాక్ తో నడుస్తోంది. అలాగే వసూలు కూడా మంచి స్థాయిలోనే ఉన్నాయి. ప్రీమియర్ల ద్వారా 1.26 లక్షల డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా ఒకటవ రోజు శుక్రవారం సాయంత్రానికి 2.25 లక్షల డాలర్లను రాబట్టింది.

ఇక ఆదివారం రోజున సాయంత్రం వరకు 1.12లక్షల డాలర్లను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మొత్తంగా 5.62 లక్షల డాలర్లను కొల్లగొట్టి హాఫ్ మిలియన్ మార్కును అందుకుంది. పైగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈ వారంలో చిత్రం మిలియన్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, మురళీ శర్మ వంటి స్టార్ నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేశాడు.

 
Like us on Facebook