చైతూ-పల్లవిల లవ్ బాండింగ్ తెలియజేసే ఏయ్ పిల్లా సాంగ్

Published on Feb 14, 2020 11:20 am IST

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల మొట్టమొదటి సారి నాగ చైతన్యతో చేస్తున్న చిత్రం లవ్ స్టోరీ. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఏయ్ పిల్లా..సాంగ్ ప్రివ్యూ నేడు ప్రేమికుల రోజు కానుకగా విడుదల అయ్యింది. ఒక నిమిషం నిడివి గల ఏయ్ పిల్లా సాంగ్ నాగ చైతన్య మరియు సాయి పల్లవిల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ తెలియజేసేలా ఉంది. మెట్రో ట్రైన్ లో చైతూకి సాయి పల్లవి ముద్దు పెట్టగా, అతడు కన్నీరు పెట్టుకుంటాడు. దానికి సాయి పల్లవి ముద్దు పెడితే కన్నీళ్లు పెట్టుకుంటారా అని అడగడం బాగుంది.

ఈ చిత్రానికి సంగీతం పవన్ సి హెచ్ అందిస్తున్నారు. కాగా లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవిల లుక్స్ చాల ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో నాగ చైతన్య పై ఓ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో రాగా అందులో నాగ చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్ లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్ లా కనిపించాడు. ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు తెరకెక్కిస్తున్నారు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :