పాకిస్థాన్లో సైతం ‘బాహుబలి’ కి సాహో అంటున్నారు !

Baahubali21
ప్రపంచవ్యాప్తంగా అశేష సినీ ప్రేక్షకుల్ని అలరిస్తూ కళ్ళు చెదిరే వసూళ్లను రాబట్టిన ‘బాహుబలి-ది కంక్లూజన్’ కూడా రిలీజ్ చేయాలని మొదట్లో అనుకోగా చిత్రం హిందూ పురాణాలకు సంబందించినదని రకరకాల రకరకాల ఏర్పడ్డాయి. సినిమాకి ఎలాంటి అనుమతులు రావని కూడా తేల్చేశారు. కానీ పాకిస్థాన్ సెన్సార్ బోర్డు మాత్రం సినిమాను చూసి వెంటనే క్లియరెన్స్ ఇచ్చేసింది.

దీంతో సినిమా పాకిస్థాన్ మొత్తం మీద 100 థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటి వరకు రూ. 4. 5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈ మొత్తం రూ. 6 కోట్ల వరకు వెళ్లే చాన్సుందని కూడా అంటున్నారు. ఇప్పటి వరకు కేవలం బాలీవుడ్లోని ఖాన్ సినిమాలకు మాత్రమే ఆదరణ దక్కే పాకిస్థాన్లో బాహుబలి-2 ఘన విజయం అందుకోవడం భారతీయ సినిమా సత్తాను చాటుతోంది.

Exit mobile version