‘బాహుబలి’ కన్నడ వెర్షన్ విడుదల కాకుండా బంద్ చేస్తారట !
Published on Apr 19, 2017 5:42 pm IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదల తేదీ ఏప్రిల్ 28 దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సర్వం సిద్దమవగా కన్నడలో మాత్రం ఇంకా సమస్య సద్దుమణగలేదు. పైగా రోజు రోజుకీ తీవ్ర రూపం దాల్చుతోంది. దర్శకుడు రాజమౌళి స్వయంగా కన్నడ ఫిల్మ్ చాంబర్ సభ్యులను సంప్రదించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. నటుడు సత్యరాజ్ కావేరీ జలాలపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెబితేనే సినిమాను రిలీజ్ కానిస్తామని అన్నారు.

అలాగే కన్నడిగులు ఈ ఏప్రిల్ 28న చిత్ర విడుదలను అడ్డుకొనేందుకు భారీ బంద్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాక రేపు జరగబోయే చిత్ర ప్రెస్ మీట్ ను కూడా భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. దీనిపై స్పందించిన రాజమౌళి సత్యరాజ్ కామెంట్స్ చేసి చాలా కాలమైంది. ఆ కామెంట్స్ తర్వాత ఆయన సినిమాలు చాలా కన్నడలో రిలీజయ్యాయి. బాహుబలి- 1 కూడా విడుదలైంది. అప్పుడు లేని సమస్యను పార్ట్ 2 విషయంలో తీసుకురావడం సరైనది కాదని అన్నారట. మరి ఈ సమస్య ఎలా ముగుస్తుందో చూడాలి.

 
Like us on Facebook