నైజాంలో రికార్డ్ కలెక్షన్లు వసూలు చేస్తున్న ‘బాహుబలి-2’ !

30th, April 2017 - 01:13:37 PM


భారీ అంచనాలతో గత శుక్రవారం విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రం వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబడుతోంది. సాధారణంగా సినిమా వసూళ్లకు కీలకమైన నైజాం ఏరియాలో ఈ చిత్రం పూర్తి స్థాయి ఆధిపత్యం కనబర్చింది. మొదటి రెండు రోజులకు కలిపి ఈ సినిమా దాదాపు రూ. 14. 3 కోట్ల షేర్ రాబట్టింది.

దీంతో చిత్రం యొక్క ఓవరాల్ కలెక్షన్లు పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. అంచనాలను మించి సినిమాలో ప్రపంచస్థాయి విజువల్ ఎఎఫెక్ట్స్, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈరోజు, రేపు సెలవుకావడం, రాబోయేవి కూడా వేసవి సెలవులు కావడంతో చిత్రం కలెక్షన్లు మరింత ఊపందుకునే అవకాశముంది.