
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో, అధునాతన సాంకేతిక విలువలతో హాలీవుడ్ కి మేము ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకునే దిశగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. హాలీవుడ్ లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాహుబలి సందడి చేస్తోంది. ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు. ఆయన బాహుబలి సినిమా ఇంటర్నేషనల్ రిలీజ్ గురించి మాట్లాడడం కోసం అక్కడికి వెళ్ళారు.
శోభు యార్ల గడ్డ మాట్లాడుతూ ‘ బాహుబలి ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం నేను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నాను. ఇప్పటి వరకూ అంటా పాజిటివ్ గానే ఉంది. ఫిల్మ్ మేకర్స్ తో కలిసి ఓ ప్రోడక్ట్ కి వరల్డ్ వైడ్ మార్కెట్ తీసుకురావడానికి కేన్స్ బెస్ట్ ప్లేస్. ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని’ శోభు యార్లగడ్డ తెలియజేశాడు. అంతే కాకుండా అక్కడి బ్రాస్సిరే డు కాసినో కేఫ్ స్టాఫ్ అంటా బాహుబలి టీ షర్ట్స్ తో సందడి చేస్తున్నారని వారి ఫోటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. రెండు పార్ట్స్ గా రానున్న బాహుబలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో సుధీప్, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

