తెలుగు సినిమా ఖ్యాతి ని పప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసిన చిత్రం’బాహుబలి’. రెండు భాగాలు గా విడుదలైన ఈ చిత్రం ఒక దాన్ని మించి ఒకటి అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఇక కలెక్షన్ల పరంగా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది ఈ చిత్రం. రాజమౌళి తెర్కకించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకం ఫై శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని లు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రం వారికి భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక ఈ చిత్ర లాభాల్లో కొంత సేవ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఈ నిర్మాతలు. దాంట్లోభాగంగా గుంటూరు లోని మాచర్ల పట్టణంలో పేద విద్యార్థులకోసం శ్రీ సత్య సాయి బాబా స్కూల్ లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు . వారు చేస్తున్న ఈ పని పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.


