‘బాహుబలి-2’ టికెట్ల ధర పెరగనుందా ?
Published on Apr 20, 2017 1:31 pm IST


కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని భారతీయ సినీ ప్రేక్షకులంతా తెగ ఉబలాటపడిపోతున్నారు. ఆ సమాధానం దొరికే ‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ డిమాండ్ వలనే సినిమాను అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హక్కుల ధరలు చాలా ఎక్కువ పలికాయి. ఆ మొత్తాన్ని రాబట్టాలంటే కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండాలి.

ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్న విషయమే. అందుకే నిర్మాతలు అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో ఉండాలనే ఉదేశ్యంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 ప్రదర్శించబోయే థియేటర్ల టికెట్ల ధరలను పెంచాలనే యోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుగుతుండగా తుది నిర్ణయం త్వరలోనే వెలువడే అవకాశముంది. జక్కన్న రాజమౌళి సృష్టించిన ఈ విజువల్ వండర్ ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది.

 
Like us on Facebook