“వీరమల్లు” టీజర్ తో దర్శకుని విషయంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.!

“వీరమల్లు” టీజర్ తో దర్శకుని విషయంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.!

Published on May 2, 2024 10:04 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో “హరిహర వీరమల్లు” నుంచి టీజర్ (Hari Hara Veeramallu Teaser) కట్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్ తో ఊహించని ట్రీట్ ని అందించిన మేకర్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమా టీజర్ తోనే ఓ సస్పెన్స్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ సినిమాకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మొదటి నుంచి వర్క్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ గత రెండు రోజులు నుంచి పోస్టర్స్ లో ఎక్కడా కూడా తన పేరు కనిపించకపోవడంతో సినిమా నుంచి తాను తప్పుకున్నారా అన్నట్టు రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు టీజర్ తో క్రిష్ పేరు పడింది.

కానీ తనతో పాటుగా మరో దర్శకుని పేరు కూడా ఈ టీజర్ సహా నేడు వచ్చిన పోస్టర్స్ లో రావడం ట్విస్ట్ గా మారింది. ఇక నుంచి జరగనున్న సినిమాని ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు దర్శకుడు జ్యోతి కృష్ణ వర్క్ చేయనున్నాడట. క్రిష్ ఆ బాధ్యతలు అతనికి అప్పగించాడు అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ (Bobby Deol) తదితరులు నటిస్తున్నారు. అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు