అమీర్ ఖాన్ రికార్డుని బద్దలుకొట్టిన ‘బాహుబలి-2’ !


బాక్సాఫీస్ ముందు ‘బాహుబలి-2’ చిత్రం యొక్క రన్ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ముఖ్యంగా బాలీవుడ్ లో ఉన్న పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది. ఇప్పటికే అత్యంత వేగంగా రూ. 100 కోట్లు, రూ. 200 కోట్లు, రూ. 300 కోట్లు అందుకున్న సినిమాగా నిలిచిన ఈ చిత్రం తాజాగా స్టార్ హీరో అమీర్ ఖాన్ యొక్క ‘పీకే’ సినిమా పేరిట ఉన్న రెండవ అత్యధిక నెట్ వసూళ్ల రికార్డును అధిగమించేసింది

ఈ సినిమా నిన్నటితో సుమారు రూ. 350 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టగా పీకే సినిమా లైఫ్ టైమ్ నెట్ సుమారు రూ.340 కోట్లు మాత్రమే. స్ట్రయిట్ హిందీ సినిమా కాకుండా హిందీలోకి డబ్ అయిన ఒక తెలుగు సినిమా ఇలా బాలీవుడ్ రికార్డుల్ని ఎంతో సులభంగా కొల్లగొట్టడమనేది పెద్ద విశేషమే. రెండు వారాలు కూడా పూర్తిగా గడవకముందే ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా యొక్క లైఫ్ టైమ్ వసూళ్లు ఇంకెంత భారీగా ఉంటాయో చూడాలి.