ప్లాన్ ప్రకారమే వచ్చేస్తున్న ‘బాబు బంగారం’!

Babu-Bangaram

విక్టరీ వెంకటేష్, ‘భలే భలే మగాడివోయ్‌’తో టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయిన మారుతిల కాంబినేషన్‌లో ‘బాబు బంగారం’ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. టీజర్‌తో విపరీతమైన అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా జూలై 29న విడుదల కానుందని దర్శక, నిర్మాతలు కొద్దిరోజుల క్రితమే ప్రకటించేశారు. ఆ ప్లాన్ ప్రకారంగానే ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసిన టీమ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది.

అయితే గత రెండు, మూడు రోజులుగా ‘బాబు బంగారం’ సినిమా వాయిదా పడనుందని కొన్ని వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలన్నీ పుకార్లేనని టీమ్ స్పష్టం చేసింది. అనుకున్న ప్రకారంగానే ఈ నెలాఖర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, షూటింగ్ దాదాపుగా పూర్తైందని టీమ్ తెలిపింది. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. వెంకటేష్ ఈ సినిమాలో ఓ కామెడీ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు.

Exit mobile version