మాస్ట్రో: అలరిస్తున్న ‘బేబీ ఓ బేబీ’ ఫుల్ లిరికల్‌ వీడియో!

Published on Jul 17, 2021 2:34 am IST

యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఫెస్ట్‌లో భాగంగా తాజాగా ‘బేబి ఓ బేబీ’ అనే పాట ఫుల్ లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

అయితే నితిన్‌, నభానటేష్‌పై చిత్రీకరించిన ఈ పాటకు శ్రీజో లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి ఆలపించగా, మహతి స్వరసాగర్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిరం ఇది అని, ఓ పియానో ప్లేయర్‌ అంధుడిగా ఎందుకు నటించాల్సి వచ్చింది? ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఆ అంధుడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా విడుదల తేదినీ త్వరలోనే ప్రకటిస్తామని వారు చెప్పుకొచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :