హీరో నాగశౌర్య గతకొంత కాలంగా సరైన హిట్ లేక వెనుకబడిపోయాడు. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ఇటీవల రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాపై ప్రేక్షకులలో ఎలాంటి బజ్ లేకపోవడంతో ఈ మూవీ వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. దీనికితోడు పలు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కావడంతో ఈ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ సినిమాను పట్టించుకున్న వారు లేరు.
దీంతో ఈ సినిమా మొదటి వీకెండ్‌కే వాష్ అవుట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. శ్రీ వైష్ణవి బ్యానర్‌పై రమేష్ దేసేన దర్శకత్వంలో సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి వసూళ్లు లేకుండానే థియేటర్ల నుంచి వాష్ అవుట్ కానుందని తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించకపోగా, ఆడియన్స్ రాక లేక థియేటర్లు వెలవెలబోయాయి. దీనికి తోడు ఈ చిత్రానికి ఎలాంటి ఓటీటీ డీల్ కూడా జరగలేదట.
మొత్తానికి, సరైన కంటెంట్ లేకపోవడం, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ సినిమాతో హీరో నాగశౌర్యకు మరోసారి బ్యాడ్ లక్ కంటిన్యూ అయిందని క్రిటిక్స్ కామెంట్ చేస్తున్నారు.


