నాని గట్స్ స్టేట్మెంట్ కి ‘బాహుబలి’ నిర్మాత పూర్తి మద్దతు.!

Published on Dec 23, 2021 3:08 pm IST

ఇప్పుడు నాచురల్ స్టార్ నాని పేరు మళ్ళీ టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. రేపు శుక్రవారం తన కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ సినిమాగా రూపొందిన “శ్యామ్ సింగ రాయ్” సినిమా రిలీజ్ పెట్టుకొని మరీ తన వ్యూ ని స్ట్రెయిట్ గా మళ్ళీ చెప్పి హాట్ టాపిక్ అవుతున్నాడు నాని.

తన సినిమా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నాని పలు కీలక కామెంట్స్ చెయ్యడం జరిగింది. ఏపీలో ఉన్న టికెట్ ధరలు వాటి మూలాన్ థియేటర్స్ యాజమాన్యం పడుతున్న ఇబ్బందులను అడ్రెస్ చేస్తూ నాని ఇందులో మాట్లాడాడు. ఇప్పుడు కొన్ని చోట్ల టికెట్ రేట్ లు 20, 10 రూపాయలు ఉన్నాయని చూశానని ఇదంతా సరైంది కాదని తెలిపాడు.

ఓ రకంగా ఇది ఆడియెన్స్ ని అవమానించినట్టు అని సంచలన కామెంట్స్ చెయ్యగా ఇవి పెద్ద ఎత్తున ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుండగా పలువురు ఇండస్ట్రీ పెద్దలు నాని గట్ స్టేట్మెంట్ తో ఏకీభవిస్తూ మద్దతు తెలుపుతున్నారు. మరి వారిలో బాహుబలి లాంటి భారీ సినిమాని నిర్మాణం వహించిన నిర్మాత శోభు యార్లగడ్డ నాని ఇచ్చిన స్టేట్మెంట్ కి పూర్తి మద్దతు ఇస్తున్నాని తెలిపారు.

టికెట్ రేట్స్ ఇష్యూ ఏపీలో డిస్టిబ్యూటర్ సంస్థని తీవ్రంగా దెబ్బ తీస్తుంది అని ఇదే కొనసాగితే మరిన్ని థియేటర్స్ కొనసాగడం అసాధ్యం, అలాగే ఇదే ఇండస్ట్రీని నమ్ముకున్న వారు కూడా తీవ్రంగా నష్టపోతారని, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాని నాని మాటలతో ఏకీభవిస్తూ తెలిపారు.

సంబంధిత సమాచారం :