రామోజీఫిలిం సిటీ లో బాలయ్య , ప్రభాస్ , చరణ్ !

Published on Feb 6, 2019 9:40 am IST

టాలీవుడ్ అగ్ర హీరోలు ప్రస్తుతం షూటింగ్లో బిజీ గా వున్నారు. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీ లో బాలకృష్ణ , ప్రభాస్ , చరణ్ వారి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు యొక్క షూటింగ్ ప్రస్తుతం అక్కడే జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

ఇక యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ల షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబందించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో సాహో ఈ ఏడాది ఆగస్టు 15న విడుదలకానుండగా ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :