RRRతో పోటీ పడేందుకు బాలయ్య ఇంట్రెస్ట్?

RRRతో పోటీ పడేందుకు బాలయ్య ఇంట్రెస్ట్?

Published on Aug 3, 2021 2:30 AM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. అయితే ఈ మాస్ ఎంటర్‌టైనర్ రిలీజ్‌పై తాజాగా ఓ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అక్టోబర్ 13న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో చాలా సినిమాలు దసరా బరి నుంచి తప్పుకున్నాయి. అయితే ఒక్క బాలకృష్ణ మాత్రం ఈ విషయంపై వెనక్కి తగ్గడం లేదని ఆర్ఆర్ఆర్‌తో పోటీ పడేందుకే బాలయ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు