బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్ నటించట్లేదట !

Published on Jan 22, 2020 1:30 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ మూవీలో కేథరీన్ థెరీసా నటించబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం కేథరీన్ థెరీసా ఈ సినిమాలో నటించట్లేదట. కేథరిన్ రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో మేకర్స్ ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తోసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాలయ్య డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే గుండుతో పాటు ఫుల్ మీసంతో ఉన్న ఫోటో బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అన్నట్టు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా పిబ్రవరి మూడో వారం నుండి మొదలు కానుంది.

షూటింగ్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. మే లో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీకాంత్ ఇంతకు ముందు నాగచైతన్య ‘యుద్ధం శరణం’లో విలన్ గా నటించాడు. కాగా ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అట.

సంబంధిత సమాచారం :

X
More