బాలయ్య కోసం గోపిచంద్ అలాంటి బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాడా?

Published on Nov 18, 2021 11:10 pm IST


నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ మలినేనితో సినిమాని మొదలుపెట్టబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమా అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో ముడిపడి ఉంటుందని, ఇందులో బాలకృష్ణను రెండు వేర్వేరు షేడ్స్‌లో చూపించబోతున్నాడట. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :