అభిమానులకు నచ్చే లుక్‌లోకి మారిన బాలయ్య

Published on Jan 16, 2020 2:00 am IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల చిత్రం త్వరలోనే మొదలుకానుంది. బాలయ్య గత చిత్రం ‘రూలర్’ పరాజయం చెందడంతో ఈ సినిమాపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు బాలయ్య లుక్ విషయంలో కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ గత చిత్రంలో టోనీ స్టార్క్ అంటూ ఒక కొత్త లుక్ ట్రై చేశారు. నిజానికి ఆ లుక్ అభిమానుల్లో చాలామందికి నచ్చలేదు. దీంతో ఆదిలోనే నిరాశ ఎదురై చివరిగా సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహపడ్డారు.

అందుకే బోయపాటి చిత్రంలో లుక్ ‘సింహ, లెజెండ్’ తరహాలో ఉండాలని బలంగా ఆశిస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్టే డైనమిక్ లుక్‌లోకి మారిపోయారు బాలయ్య. కోర మీసం, రెగ్యులర్ హెయిర్ స్టైల్ చేసుకుని ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ లుక్ పట్ల ఫ్యాన్స్ చాలా సంతృప్తిగా ఉన్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, క్యాథరిన్ థ్రెసాలు కీలక పాత్రలు చేయనున్నారు.

సంబంధిత సమాచారం :