నందమూరి మరియు నారా వారి ఇంట్లో ఈ రోజు ఎంతో శుభదినం. కేవలం ఉగాది పండుగ అని మాత్రమే కాదు.. ఈ పండుగ పర్వదినాన నారా వారి ఇంట్లో వారసుడు వచ్చాడు. ఇప్పుడు అర్థమయ్యేలా చెబుతా.. నారా చంద్రబాబు నాయుడు అబ్బాయి నారా లోకేష్ కి, నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణికి వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితమే బ్రాహ్మణి నిండు గర్బినిగా ఉందని తెలియజేశాం. ఈ పండుగ దినాన బ్రాహ్మణి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది.
దీంతో నారా లోకేష్ తండ్రి అవ్వడమే కాకుండా, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ తాతయ్యలు అయ్యారు. ఈ పండుగ పర్వదినాన వారసుడు పుట్టడంతో అటు నారా వారి ఇంట్లో, ఇటు నందమూరి వారి ఇంట్లో పండుగ వాతావరణం మరింత ఎక్కువైంది. ఈ పండుగ దినాన తాతయ్యలైన నారా చంద్రబాబు నాయుడుకి, నందమూరి బాలకృష్ణకి మరియు తల్లి తండ్రులైన నారా లోకేష్ – బ్రాహ్మణిలకు 123తెలుగు.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


