చాలా రోజులుగా ఓ విషయం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఓ శుభవార్త. ఇంతకీ ఏంటా విషయం అనుకుంటున్నారా.. అదేనండి నందమూరి బాలకృష్ణ నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి.. ఫస్ట్ మూవీ ఎప్పుడు అనే దాని కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్న మొదటి సినిమా 2017లో ఉంటుందని బాలయ్య తెలియజేశాడు. అలాగే ఇంకా ఆ సినిమాకి డైరెక్టర్ ని ఎంపిక చేయలేదు, అలాగే ఎలాంటి కథతో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయాలనేది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదని బాలయ్య తెలిపారు.
గతంలో బాలయ్య చాలా సార్లు తన వారసత్వాన్ని మోక్షజ్ఞ కంటిన్యూ చేస్తాడని చెప్పినా ఎప్పుడు సినిమా ఉంటుందనేది తెలుపలేదు. లేటెస్ట్ గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం మోక్షజ్ఞ యుఎస్ లో ఉన్నాడు. అక్కడ తన స్టడీస్ తో పాటు నటనలో కూడా తనని తానూ మెరుగు పరుచుకుంటున్నట్లు సమాచారం. 2017 మోక్షజ్ఞ ఎంట్రీ అని ఫిక్స్ చేసినా నందమూరి అభిమానులు మాత్రం అప్పటి వరకూ వెయిట్ చెయ్యడం కష్టమే అంటున్నారు.


