హుదూద్ బాధితులను ఆడుకోవడానికి ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విరాళాల సేకరణ ఈ రోజు మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే నాగార్జున, దగ్గుబాటి ఫ్యామిలీ, నితిన్ పలువురు యంగ్ హీరోస్ తమ విరాళాన్ని ప్రకటించారు. తాజాగా వీరి లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా చేరారు. నందమూరి బాలకృష్ణ 30 లక్షల రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా 20 టన్నుల బియ్యాన్ని మరియు అక్కడి వారికి అవసరమైన మెడిసిన్స్ ని పంపించారు.
సమయం గడిచే కొద్దీ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న విరాళాల సంఖ్య మరియు విరాళా దాతల లిస్టు పెరుగుతోంది. నిన్ననే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, కృష్ణ, విజయనిర్మల, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్, రామ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వంటివారు తమ విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిధికి విరాళాలు అందజేశారు.


