మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..!

Published on Jul 19, 2021 11:07 pm IST

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీపై గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌‌ ద్వారా మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు రానున్నాడని ఇప్పటికే చెప్పిన బాలకృష్ణ తాజాగా ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కబోతుందన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఆదిత్య 369’ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాల‌య్య మీడియాతో ముచ్చటించారు.

ఈ సినిమాకు సీక్వెల్‌ను 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశామని, అయితే ఇప్పటివరకు ఈ సీక్వెల్‌కు దర్శకుడిని ఫైనల్ చేయలేదని చెబుతూనే తాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు రెండేళ్ల సమయాన్ని తీసుకోవడం చూస్తుంటే మోక్షజ్ణ ఎంట్రీనీ భారీగానే ప్లాన్స్ చేస్తున్నారనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :