ఉగాది నాడు బాలయ్య-గోపిచంద్ సినిమా టైటిల్‌ని రివీల్ చేయబోతున్నారా?

Published on Apr 1, 2022 3:01 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాస‌న్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #ణ్భ్ఖ్107 ప్రాజెక్ట్ పేరిట ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లింది.

అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్‌ని ఖరారు చేయలేదు మేకర్స్. ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను వదిలే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ప్రస్తుతం ఈ పనుల్లోనే మేకర్స్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అయితే దీనిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :