బాలయ్య మాస్ రికార్డు.. సీనియర్ హీరోల్లో ఒకే ఒక్కడు!

బాలయ్య మాస్ రికార్డు.. సీనియర్ హీరోల్లో ఒకే ఒక్కడు!

Published on Jan 14, 2025 3:03 AM IST

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు బాబీ డైరెక్ట్ చేయగా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ మూవీ సాలిడ్ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’ అడుగు పెట్టింది. బాలయ్య వరుసగా నాలుగు చిత్రాలతో ఈ ఫీట్ సాధించారు.

సీనియర్ హీరోల్లో వరుసగా నాలుగు సినిమాలను 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేర్చిన హీరోగా బాలయ్య సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బాలయ్య ఈ ఫీట్ అందుకున్నాడు. ఇక ‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు