బాలయ్య, గోపిచంద్ మలినేని సినిమాకు టైటిల్ ఇదేనా?

Published on Sep 14, 2021 2:40 am IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాతో బిజీగా ఉండగా, ఈ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ మలినేనితో సినిమాని పట్టాలెక్కించనున్నారు. అయితే #ణ్భ్ఖ్107 టైటిల్‌తో ప్రారంభం కానున్న ఈ సినిమా అసలు టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాకు “రౌడీయిజం” అనే టైటిల్‌ను పెట్టబోతున్నారని, ఈ టైటిల్‌ను ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే త్రిష లేదా ఇలియానాని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట.

సంబంధిత సమాచారం :