బాలయ్య తరువాత సినిమా ఫిక్స్ ?

Published on Oct 26, 2020 6:56 am IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – కింగ్ నాగార్జున కలయికలో మళ్ళీ మరో సినిమా రాబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా హాల్ చల్ చేస్తోంది. అయితే వీరి కలయికలో సినిమా అనేది కేవలం రూమరే అని తెలుస్తోంది. కాగా ‘పూరి – బాలయ్య’ కలయికలో సినిమా రానుందని సమాచారం. ప్రస్తుతం పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమేనని.. ఇప్పటికే పూరి, బాలయ్యకి కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. ఇక చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేసిన పూరి.. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. మరి పూరి ఇక నుండి వరుసగా హిట్స్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More