‘లెజెండ్’ వంటి భారి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ, త్రిష జంటగా సత్యదేవ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రంపచోడవరం పరిసర అటవీ ప్రాంతాలలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలను, హీరోయిన్ త్రిష పాల్గొనగా మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
వర్షాలు షూటింగ్ కు అంతరాయం కలిగించినా యూనిట్ మొత్తం బాగా సహకరించారని నిర్మాత చెప్పారు. 13 రోజుల పాటు అటవీ ప్రాంతంలో అందమైన లొకేషన్స్ లలో షూట్ చేసిన యాక్షన్ సన్నివేశాలు బాగా వచ్చాయని దర్శకడు తెలిపారు.
రేపటి నుండి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో షూటింగ్ ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం రాధికా ఆప్టేను సంప్రదించారు.


