వైరల్ గా మారిన మోక్షజ్ఞ ఫోటో.

Published on Jul 27, 2019 11:21 am IST

నందమూరి నటవారసులలో నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఆరంగేట్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై రకరకాల వార్తలు రావడం జరుగుతుంది. ఈ మధ్య మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదని, ఆయన బిజినెస్ మెన్ గా ఎదగాలన్న ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా మోక్షజ్ఞ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసిన కొందరు ఆయన ఇంకా తెరంగేట్రానికి సిద్ధం కాలేదని చెప్పుకుంటున్నారు. ఆ ఫొటోలో మోక్షజ్ఞ కూడా నార్మల్ లుక్ లో ఉన్నారు. సాధారణంగా హీరో కావాలనుకున్న స్టార్ కిడ్స్ ఫిజిక్, డ్రెస్ సెన్స్ విషయంలో ఐకానిక్ గా రెడీ అయ్యి యూత్ లో ఫాలోయింగ్ పెంచుకొనే పనిలో ఉంటారు. ఇందుకు భిన్నంగా ఉన్న మోక్షజ్ఞను చూస్తుంటే నిజంగానే ఆయనకు హీరో కావడం ఇష్టం లేదా అనే అనుమానాలకు బలం చేకూర్చేదిలా ఉంది.

సంబంధిత సమాచారం :