బాలయ్యకు భారీ పోటీ తప్పేలా లేదు ?

Published on Mar 16, 2021 2:30 am IST

బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద నందమూరి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ చాన్నాళ్ల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే ఇదే రోజున రవితేజ ‘ఖిలాడి’ కూడ విడుదలకానుంది.

దీంతో బాక్సాఫీస్ ఫైట్ టఫ్ అయింది. ఈ పోటీ చాలదన్నట్టు అదే రోజున ‘నారప్ప’తో వెంకీ కూడ దిగబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘నారప్ప’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ముందుగా సినిమాను మే 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ మే 13న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ కూడ ఉంది. ఈ పోటీని అవాయిడ్ చేయడానికి రిలీజ్ డేట్ మార్చుకోవాలనే యోచనలో ఉన్నారట ‘నారప్ప’ టీమ్. అది కూడ మే 28న ఉండొచ్చని టాక్. అదే జరిగితే బాలయ్య సినిమాకు క్లిష్టమైన పోటీ తప్పదు.

సంబంధిత సమాచారం :