16 ఏళ్ళ క్రితం ఆగిపోయిన బాలయ్య సినిమా ‘నర్తనశాల’ రిలీజ్.. అభిమానుల కోసం

16 ఏళ్ళ క్రితం ఆగిపోయిన బాలయ్య సినిమా ‘నర్తనశాల’ రిలీజ్.. అభిమానుల కోసం

Published on Oct 19, 2020 6:05 PM IST

నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రాన్ని తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనేది బాలయ్య కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి 2004లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కొంత షూటింగ్ కూడ జరిపారు. కానీ అనూహ్యంగా ఆ చిత్రంలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత రీస్టార్ట్ చేయాలని ప్రయత్నించినా సౌందర్య స్థాయి నటి దొరక్క ఆగిపోయారు బాలయ్య. దీంతో ఆయన, ఆయనతో పాటు నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సినిమాను చూడలేమని బాధపడ్డారు.

కానీ 16 ఏళ్ళ తర్వాత అభిమానుల్లోని ఆ బాధను పోగొట్టడానికి బాలయ్య పూనుకున్నారు. అప్పట్లో జరిపిన చిత్రీకరణను ఎడిట్ చేసి 17 నిముషాలకు కుదించి విజయదశమి కానుకగా విడుదల చేయనున్నట్టు బాలయ్య ప్రకటించారు. ‘నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళ నుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది’. బాలయ్య చేసిన ఈ ప్రకటనతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు